Home  »  TV News  »  వసుధార, జగతిల సీక్రెట్ ప్లాన్ ఏంటి?

Updated : Apr 22, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -743 లో.. వసుధార, రిషిలు కాలేజీకి రెడీ అయి వెళ్తారు. మీరు సౌజన్య రావు ప్రపోజల్ గురించి ఆలోచించొద్దని రిషి తో అంటుంది వసుధార. లేదు వసుధార.. ఆ ప్రపోజల్ తలచుకుంటేనే నచ్చడం లేదని రిషి అంటాడు. ఇంతలో రిషికి ఏదో ఫోన్ వస్తుంది. లిఫ్ట్ చేసి మాట్లాడుతాడు. ఆ తర్వాత వసుధారతో నువ్వు కాలేజీకి వెళ్ళమని రిషి అంటాడు. ఆ కాల్ చేసింది సౌజన్య రావు.. అతన్ని కలవాడనికే రిషి వెళ్తాడు.

ఆ తర్వాత సౌజన్య రావు దగ్గరికి రిషి వెళ్తాడు. నేను చెప్పిన ప్రపోజల్ గురించి ఏం రిప్లై ఇవ్వలేదు.. దాని గురించి ఎదురుచూస్తున్న అని సౌజన్య రావు అంటాడు. అయిన పనికిమాలిన ప్రపోజల్ కి సమాధానం ఎలా వస్తుంది అనుకున్నారు. మా జగతి మేడం వసుధారలు చెంప దెబ్బ కొట్టినట్టు.‌. ఆన్సర్ అక్కడే చెప్పారు కదా.. నేనే మీకు ఒక అవకాశం ఇస్తున్నాను అని రిషి అనగానే.. ఏంటని సౌజన్య రావు అంటాడు. DBST కాలేజీ మెయిన్ గా ఉంటుంది. మా కాలేజీ లో మీ కాలేజీని కలపండని చెప్పి వెళ్ళిపోతాడు. రిషి మాటలకి సౌజన్యరావ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత రిషి ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళకి జరిగిందంతా చెప్తాడు. ఆ సౌజన్య రావుకి మంచిగా బుద్ది చెప్పావ్.. మనం మెడికల్ కాలేజీ పెడదాం. దానికి సంబంధించినవన్నీ నేను చూసుకుంటానని ఫణింద్ర అంటాడు. మరోవైపు సౌజన్యరావు అతని బాస్ కి.. రిషి ప్రపోజల్ కి ఒప్పుకోలేదని, మన కాలేజీనే వాళ్ళ కాలేజీలో కలపాలట అని సౌజన్య రావు మెసేజ్ చేస్తాడు. మరి అలానే చెయ్యండి. మనమే అవకాశం క్రీయేట్ చేసుకుందామని సౌజన్య రావు బాస్ అంటాడు. దానికి సౌజన్య రావు సరేనంటాడు. మరోవైపు జగతి, వసుధార సీక్రెట్ గా ఏదో ప్లాన్ చేస్తారు. దానికోసం రిషికి తెలియకుండా తన చేత సంతకాలు పెట్టిస్తుంది వసుధార. సర్ ని మోసం చేస్తున్నావేమో మేడమ్ అని జగతితో వసుధార అనగానే.. మనం చేసేది మంచి పని.. నువ్వేం టెన్షన్ పడకని జగతి అంటుంది.

ఆ తర్వాత సౌజన్య రావు రిషి అన్న మాటలు పట్టుకొని వాళ్ళింటికి వచ్చి‌.. ఫణింద్ర, మహేంద్రతో మాట్లాడతాడు. రిషి కోపంలో ఒక మాట అనేసాడు. మా కాలేజీని మీ కాలేజీలో కలపమన్నాడు.. అదే నిజం చేద్దామని వచ్చానని సౌజన్య రావు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.